శ్రీ సింహాతో రాగ పెళ్లి జరగడం నాకెంతో సంతోషంగా ఉంది.. ప్రముఖ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
శ్రీ సింహాతో రాగ పెళ్లి జరగడం నాకెంతో సంతోషంగా ఉంది.. ప్రముఖ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ రీసెంట్‌గా సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ మనవరాలు రాగను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీ మోహన్ వీరిద్దరి పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను శ్రీసింహ- రాగ వివాహ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. పెళ్లికి ముందు నుంచే రాగ, శ్రీ సింహాలు మంచి ఫ్రెండ్స్. అలాగే రాజమౌళి కోడలు పూజా, రాగ కూడా మంచి స్నేహితులు. వీలు కుదిరినప్పుడల్లా రాగ వాళ్లింటికి వెళ్లేది.

ఈ క్రమంలో కీరవాణి, రాజమౌళి కుటుంబాలు ఎంత బాగా కలిసి ఉంటున్నాయో ఆమె చూసేది. ఇక చిన్నప్పటి నుంచి రాగకు ఉమ్మడి కుటుంబాలు అంటే ఎంతో ఇష్టం ఉండటంతో వారి కుటుంబాన్ని ఎంతో ఇష్టపడింది. ఓ రోజు శ్రీసింహకు నా మనవరాలే ప్రపోజ్ చేసింది. ఈ విషయాన్ని మొదట్లో మాకు చెప్పలేదు. ఓ సారి మా ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. అప్పుడు నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాం. అప్పుడు తన మనసులోని మాట బయటపెట్టింది’ అంటూ మురళి మోహన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed