- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kim Jong Un: రెచ్చగొడితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.. ఉత్తర కొరియా అధినేత కిమ్ వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ కొరియా, అమెరికాలపై అణుబాంబులు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. రెండు దేశాలు ఉత్తర కొరియాను యుద్ధానికి రెచ్చగొడుతున్నాయని, కొరియా ద్వీపకల్పంలో శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం ఆయన డిఫెన్స్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. తన దేశ సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించే ప్రయత్నం చేస్తే శత్రువులపై నార్త్ కొరియా సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తామని తెలిపారు. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో అణ్వాయుధాల ఉపయోగాన్ని తోసిపుచ్చలేమని తెలిపారు.
ఉత్తర కొరియా అణు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. దక్షిణ కొరియా, యూఎస్‌లు అణు, వ్యూహాత్మక ప్రణాళిక ఆధారంగా తమ సైనిక కూటమిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. తమ దేశాన్ని అస్థిరపర్చేందుకు రెండు దేశాలు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాగా, నార్త్ కొరియా అణ్వాయుధాలను ఉపయోగించినట్లయితే ఆ దేశ అంతానికి దారి తీస్తుందని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ ఇటీవల హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కిమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.