ట్రంప్‌కు మరోషాక్ : భారీ జరిమానా విధించిన న్యూయార్క్ కోర్టు

by samatah |
ట్రంప్‌కు మరోషాక్ : భారీ జరిమానా విధించిన న్యూయార్క్ కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు షాకిచ్చింది. ఓ కుంభకోణానికి సంబంధించిన కేసులో 355 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అంతేగాక మూడేళ్ల పాటు ఎటువంటి వ్యాపారాలూ నిర్వహించకుండా నిషేధించింది. అలాగే ట్రంప్ కుమారులు డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లు కూడా ఒక్కొక్కరు 4 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 100 మిలియన్ డాలర్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ట్రంపుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అటార్నీ జనరల్‌ లెటిషియా జేమ్స్‌ ఫిర్యాదు మేరకు ట్రంపుపై కేసు నమోదు చేశారు. ట్రంప్ 2011-21 మధ్య బ్యాంక్ లోన్, తక్కువ బీమా ప్రీమియం పొందడానికి తన ఆస్తుల విలువను ట్రంప్ ఎక్కువగా చూపించారని పేర్కొన్నారు. దీనిపై గతేడాది విచారణను న్యాయస్థానం పూర్తి చేసి..తాజాగా తీర్పు వెలువరించింది. 2023జనవరిలో ట్రంప్‌పై అటార్నీ జనరల్ వ్యాజ్యాన్ని కొట్టివేయడానికి న్యూయార్క్ న్యాయమూర్తి నిరాకరించారు. ఈతీర్పుపై ట్రంప్ స్పందించారు. ఇది పూర్తి మోసపూరితమైన నిర్ణయం అని ఆరోపించారు. పై కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు తెలిపారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed