- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టైటాన్ సబ్ మెరైన్ నుంచి చివరి మాటాలివే
దిశ వెబ్ డెస్క్ : 112ఏండ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఘటన ప్రపంచ విషాదకర సంఘటనలలో ఒకటిగా నిలిచింది. సముద్రం అట్టడుగున అంటే ఉపరితలం నుంచి దాదాపు 3.8 కిలోమీటర్ల లోతున శిథిల టైటానిక్ నిలిచి ఉంది. అప్పటి ప్రమాదంలో ఓడలోని 1,500 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. సముద్రం అడుగున టైటానిక్ శిధిలాలను చూసేందుకు గతేడాది జూన్ 18న ఓషన్ గేట్ కంపనీకి చెందిన 'టైటాన్' మినీ సబ్ మెరైన్ సాహస ప్రయాణం సైతం విషాదంగానే ముగిసింది. టైటాన్ సబ్ మెరైన్ సముద్రం అడుగున విచ్ఛిన్నమై అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తాజాగా న్యాయ విచారణ మొదలైంది. విచారణ క్రమంలో ప్రమాదానికి ముందు సబె మెరైన్ లోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు బయటికొచ్చాయి. 'అంతా బాగానే ఉంది' అనే మూడు పదాలను వారు చెప్పినట్లు విచారణలో తేలింది. ఈ ప్రమాదానికి సంబంధించిన చివరి ఫొటో కూడా బయటికొచ్చింది. ఈ చిత్రాన్ని తీసింది ఓ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ అని విచారణ బృందం వెల్లడించింది. టైటానిక్ నౌక శకలాలను వీక్షించేందుకు బయల్దేరిన టైటాన్ రెండు గంటల్లోనే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై అమెరికా కోస్టుగార్డ్ అధికారులు రెండు వారాల విచారణ మొదలు పెట్టారు. ప్రమాదంలో వాస్తవాలను వెలికితీసి.. భవిష్యత్తులో ఇటువంటివి చోటు చేసుకోకుండా సూచనలు చేయడమే ఈ విచారణ ముఖ్య లక్ష్యం. ఈ సందర్భంగా టైటాన్ యాత్ర రిక్రియేషన్ చేశారు. దీనిలో ఆ జలాంతర్గామి నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజ్ లు, పోలార్ ప్రిన్స్ మదర్ షిప్ నుంచి విడిపోవడం వంటివి ఉన్నాయి. ప్రమాదం జరిగిన రోజు ఉదయం 9.17 నిమిషాలకు టైటాన్ జలాంతర్గామి ప్రయాణం మొదలు పెట్టింది. ఈ సందర్భంగా మదర్ షిప్ దాని లోతు, బరువు గురించి అడిగింది. అప్పటికి ఆన్ బోర్డు డిస్ ప్లే టైటాన్ కనిపిస్తోంది. చివరి మెసేజ్ 10.47 సమయంలో వచ్చింది. అప్పటికి టైటాన్ 3,346 మీటర్ల లోతుకు చేరింది. ఆ సమయంలో రెండు వెయిట్స్ ను డ్రాప్ చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత కమ్యూనికేషన్ తెగిపోయింది. టైటానిక్ ఓడ ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో టైటాన్‌కు చెందిన శకలాలను అప్పట్లో గుర్తించారు. ఈ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో పాకిస్తాన్‌కు చెందిన వ్యాపారవేత్త షాహజాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటీష్ బిలీనియర్ బిజినెస్‌మ్యాన్ హమీష్ హార్డింగ్‌లు, ఫ్రెంచ్ అన్వేషకుడు పౌల్ హెన్రీ నార్గోలెట్, ఓషన్‌గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్‌టన్ రష్ ఉన్నారు.
టైటాన్ జలాంతర్గామి తయారీలో లోపాలను విచారణ సందర్భంగా విచారణాధికారులు ప్రస్తావించారు. నిర్మాణం తర్వాత దీనిని థర్డ్ పార్టీ పరీక్షలకు పంపలేదని, ఎటువంటి వాతావరణ, ఇతర ఒత్తిళ్లకు గురిచేసి పరీక్షించలేదన్నారు. దీనికి తోడు టైటాన్ 2021, 2022లో సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. అది నిర్వహించిన మొత్తం 13 యాత్రల్లో 118 పరికరాల్లో ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసిందన్నారు. ముఖ్యంగా వెలుపలికి వచ్చే సమయంలో ఫ్రంట్ డోమ్ లో సమస్యలు, 3,500 మీటర్ల లోతులో థ్రస్టర్లు మోరాయించడం, బ్యాటరీల్లో సమస్యలు వచ్చి 27 గంటల పాటు ప్యాసింజర్ల ఇరుక్కు పోవడం వంటి లోపాలు ఉన్నాయని విచారణ బృందం వెల్లడించింది.