‘పసిఫిక్’లోకి రేడియో యాక్టివ్ వాటర్..

by Vinod kumar |
‘పసిఫిక్’లోకి రేడియో యాక్టివ్ వాటర్..
X

టోక్యో: ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి రేడియోధార్మిక నీటిని పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేసేందుకు జపాన్ అణు నియంత్రక సంస్థ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్ నుంచి విడుదలైన మిలియన్ టన్నుల కంటే ఎక్కువ రేడియో ధార్మిక నీటిని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో (టెప్కో) ద్వారా సముద్రంలోకి విడుదల చేసేందుకు మార్గం సుగమం అయింది. ఈ నీటిని శుద్ధి చేసి విడుదల చేయడంతో పర్యావరణంపై అతి తక్కువ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రెండేళ్ల సమీక్ష తర్వాత నిర్ధారించింది.

అయితే.. ఈ విడుదలపై తుది నిర్ణయం జపనీస్ రెగ్యులేటర్ దే అని పేర్కొన్నది. ఈ నీటిని సొరంగం ద్వారా సముద్ర గర్భంలో ఒక కిలోమీటర్ లోపలికి విడుదల చేస్తారని, దీంతో కలుషిత నీరు సముద్ర గర్భంలోకి వెళ్లిపోతుందని తెలిపింది. జపాన్ నిర్ణయాన్ని దేశంలోనూ, విదేశాల్లోనూ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. రేడియేషన్ నీటిని సముద్రంలో విడుదల చేస్తే చేపల వ్యాపారానికి ఇబ్బంది కలుగుతుందని స్థానిక ఫిషింగ్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దక్షిణ కొరియా, చైనా, కొన్ని పసిఫిక్ ద్వీప దేశాలు జపాన్ చేపల దిగుమతిని నిషేధించాయి. శుద్ధి చేసినా నీటిలోని రేడియో ధార్మికతను తొలగించడం సాధ్యం కాదని పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed