- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పర్యాటకుల కోసం ఈ-వీసాను ప్రారంభించిన జపాన్
దిశ, నేషనల్ బ్యూరో: పర్యాటకులను పెంచుకోవడానికి జపాన్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోకి ప్రవేశించాలనుకునే పర్యాటకుల కోసం భారత్‌తో పాటు అనేక దేశాలకు ఈ-వీసా దరఖాస్తును ప్రారంభించింది. సాధారణ పాస్‌పోర్ట్‌ని కలిగి ఉండి జపాన్‌లోకి స్వల్పకాలికంగా పర్యటించాలనుకునే వారి కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. సింగిల్-ఎంట్రీ వీసా గరిష్టంగా 90 రోజుల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇది భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కంబోడియా, కెనడా, సౌదీ అరేబియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, తైవాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, USA దేశాలకు వర్తిస్తుంది. ఈ దేశాల ప్రజలు జపాన్‌లో తక్కువ వ్యవధిలో పర్యటించాలనుకుంటే ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. జపాన్ ఈ వీసా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను నమోదు చేయాలి. వీసా దరఖాస్తుకు సంబంధించిన వివరాలు రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు సెండ్ చేస్తారు. ఆ తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఇంటర్వ్యూ తేదీని ఎంచుకోవాలి.