- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Suryapet : వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి..
దిశ,సూర్యాపేట టౌన్ : డాక్టర్ నిర్లక్ష్యం, సమయానికి సరైన వైద్యం అందజేయడంలో అలసత్వం వహించడంతో చిన్నారి మృతికి డాక్టర్ కారణమయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన ఏకయ్య స్వర్ణలత రెండవ కుమార్తె మోడెం ఉద్ధిజ్ఞ (7) కు జ్వరం రావడంతో సూర్యాపేట పట్టణంలో ఓ పిల్లల ఆసుపత్రికి గురువారం తీసుకొచ్చారు. డాక్టర్ చిన్నారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం చేయడంలో ఆలస్యం చేయడంతో తన కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ వైద్యం చేయడంలో ఆలస్యం వహించడం వల్లే తన కుమార్తె చనిపోయిందని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తన కుమార్తె చావుకు కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించాలని బంధువులు ఆరోపిస్తున్నారు.
సమయానికి నేను వైద్యం చేశాను..
పాపను తీసుకొచ్చిన వెంటనే వైద్యం చేశానని డాక్టర్ తెలిపారు. పాపకు పరీక్షలు నిర్వహించినప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని వేరే హాస్పటల్ కి తీసుకెళ్లమని చెప్పానని, అయినప్పటికీ వైద్యం చేయాలని తల్లిదండ్రులు కోరడంతో వైద్యం చేశానని తెలిపాడు. అంతలోనే అనుకోకుండా ఈ సంఘటన జరిగిందని, అప్పటికి పాపను బ్రతికించడం కోసం చాలా ప్రయత్నం చేశాను దురదృష్టవశాత్తూ ఈ సంఘటన జరిగిందని డాక్టర్ అన్నారు.
బంధువుల, పోలీసుల మధ్య వాగ్వాదం...
చిన్నారి మృతికి కారణమైన డాక్టర్ పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరు వైద్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చిన్నారి తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతికి కారకులైన వైద్యులను అరెస్టు చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో పోలీసులకు, బందువులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిన్నారి మృతికి కారణాలు తెలుసుకొని న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. మృతి చెందిన చిన్నారి తండ్రి యాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.