- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ దళారి ప్రభుత్వం (Congress government) రైతుల(Farmers)ను నిండా ముంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ట్విటర్ వేదికగా విమర్శి్ంచారు. తన ట్వీట్ లో కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యంతో రైతు తన కొనుగోలు బాధలను ఏకరువు పెడుతున్న వీడియోను పోస్టు చేశారు. వానాకాలం వరికోతలు సాగుతున్నాయి..కానీ నేటి వరకు రైతుబంధు వేయలేదని, రూ.15 వేల రైతు భరోసా ఊసే లేదని మండిపడ్డారు. కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదని, దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారని, అక్టోబరు నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందని, కానీ, అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన తీరు రైతన్న అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
దళారులతో కుమ్మక్కైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదని, నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనేలేదన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక ప్రారంభించిన ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు ప్రక్రియ నిలిచిందని ఆరోపించారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నాడని కేటీఆర్ విమర్శి్ంచారు.