Chikmagalur: చిక్‌మగళూరు దేవిరమ్మ ఆలయం వద్ద తొక్కిసలాట.. కొండ పైనుంచి జారి పడిన 10 మంది భక్తులు

by Shiva |
Chikmagalur: చిక్‌మగళూరు దేవిరమ్మ ఆలయం వద్ద తొక్కిసలాట.. కొండ పైనుంచి జారి పడిన 10 మంది భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక రాష్ట్రం (Karnataka State)లోని చిక్‌‌మగళూరు (Chikmagalur) మాణిక్యధార కొండ (Manikyadhara Konda)కు భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే దేవిరమ్మ ఆలయానికి (Deviramma Temple) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూ కట్టారు. పరిమితికి మించి జనం ఒక్కసారిగా కొండపైకి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ పరిణామంతో జరిగిన తొక్కిసలాటలో కొండ పైనుంచి 10 మంది భక్తులు జారీ పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి భక్తులను రక్షించారు. అందులో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా.. భక్తుల రద్దీ కారణంగా ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుపోయింది.

Advertisement

Next Story

Most Viewed