Crime : క్షణికావేశం.. వదిన చేతిలో మరిది దారుణ హత్య..

by Aamani |
Crime : క్షణికావేశం.. వదిన చేతిలో మరిది దారుణ హత్య..
X

దిశ, ఖమ్మం రూరల్: క్షణికావేశంలో సొంత మరిదిని వదిన మతం మార్చిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కోర్ల రామయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన ప్రశాంత్ కు వివాహం జరిగింది. కుమార్తె ప్రియాంక కూడా పెళ్లి జరిగింది. చిన్న కుమారుడు ప్రదీప్ కు(27) ఇంకా పెళ్లి కాలేదు. దీపావళి పండుగకు చెల్లె అయిన ప్రియాంకను పండుగకు తీసుకొచ్చారు. గురువారం రాత్రి వదిన ఇందు మరదలు ప్రియాంకకు స్వల్ప గొడవ జరిగింది.

బయటకు పోయి ఇంటికి వచ్చిన ప్రదీప్ కి విషయం తెలియడంతో మా చెల్లెతో ఎందుకు గొడవ పడ్డావని వదినను ప్రదీప్ నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటలు పెరగడంతో ఆగ్రహించిన వదిన కత్తితో మరిది గుండెలో పొడిచింది. ప్రదీప్ రక్త స్రావంలో కొట్టుమిట్టాడుతుండగా గమనించిన కుటుంబ సభ్యులు తో పాటు చుట్టుపక్కల వారు హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రదీప్ శ్వాస విడిచాడని జిల్లా ప్రభుత్వ వైద్యాధికారులు దృవీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ రూరల్ సీఐ ఎం.రాజు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story