- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ganja Seized : సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్.. ట్యాంకర్‌లో తరలిస్తూ..
దిశ, వాంకిడి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం మీదుగా అక్రమంగా తరలిస్తున్న 290 కేజీల గంజాయిని గురువారం సాయంత్రం వాంకిడి పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాంకిడి లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో మహారాష్ట్ర వైపుకు అనుమానాస్పదంగా వెళ్తున్న ట్యాంకర్ లారీని ఆపి పోలీసులు తనిఖీ చేయగా రెండు పోర్షన్ లు ఖాళీగా కనిపించాయి. లారీలోనీ మూడోవ పొర్షన్ గంజాయి లభించింది. ట్యాంకర్ లారీని సీజ్ చేసి తూకం వేయగా అందులో రెండు కిలోల చొప్పున 145 ప్యాకెట్లలో 290 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. దీని విలువ సుమారురూ. 72.50 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
మధ్యప్రదేశ్ కు చెందిన ట్యాంకర్ లారీ డ్రైవర్ బల్వీర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అదే రాష్ట్రానికి మరో వ్యక్తి అరబింద్ ఇచ్చిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచి గంజాయి తెచ్చి అరబింద్ సరఫరా చేస్తున్నట్లు ప్రతి నెల రెండు నుంచి మూడు ట్రిప్ లు ట్యాంకర్ లారీ ద్వారా తీసుకెళ్తున్నట్లు, ఇందుకు ట్రిప్ కి లక్ష రూపాయల చొప్పున అరబింద్ కిరాయి ఇస్తున్నట్లు చెప్పారు. బల్వీర్ సింగ్ పై కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడైన అరబింద్ ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని మధ్యప్రదేశ్ పంపించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అరబింద్ పట్టుబడితే ఈ ముఠా సభ్యులతో పాటు మిగతా గంజాయి రవాణా విషయాన్ని బయటకు వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ వెంట డీఎస్పీ కరుణాకర్, సీఐలు, ఎస్ఐ ప్రశాంత్ ఉన్నారు.