- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన విద్యాశాఖ
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగపు సెక్రేటరీలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని గురుకుల విద్యా సంస్థలు(TREIS), ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ చార్జీలను భారీగా పెంచింది. డైట్ చార్జీల విషయంలో తమ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు యథావిధిగా అమలు చేయడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే డైట్ లో పోషకాహారం ఉండేలా మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. పదిరోజుల్లో కొత్త డైట్ ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
- Tags
- CM Revanth Reddy