ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న రిసెప్షన్ ఫొటోలు

by Kavitha |   ( Updated:2024-11-01 15:50:29.0  )
ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న రిసెప్షన్ ఫొటోలు
X

దిశ, సినిమా: ప్రముఖ సీరియల్ నటి సురభి జ్యోతి(Surbhi Jyothi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ భామ ఎన్నో సీరియల్స్‌లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడైన ప్రముఖ బాలీవుడ్ నటుడు సుమిత్ సూరి(Sumith Suri)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా జరిగిన రిసెప్షన్(Reception) పార్టీలో తన అందంతో అందరినీ కట్టిపడేసింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో లెహంగాకు మ్యాచింగ్ డైమండ్(Dimond) ఇయర్ రింగ్స్ పెట్టుకొని, మెడలో మంగళసూత్రం వేసుకొని ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా(Instagram) వేదికగా షేర్ చేసింది.

అంతేకాక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఆమె డ్యాన్స్(Dance) చేస్తూ తెగ సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా సురభి.. ‘ఖుబూల్ హై’(Qubool Hai), ‘నాగిన్’(Nagin), కోయి లౌట్‌కే ఆయా హై’(Koi Lout ke Aaya Hi) వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ప్రియుడు సుమిత్.. 2013లో బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్, వెబ్ సిరిసుల్లోను నటిస్తూ మంచి స్టార్ ‌డమ్ అందుకున్నాడు.

Read More..

శ్రీలీలకి స్పెషల్ గిఫ్ట్ పంపించిన ఆ మెగా యంగ్ హీరో..? ఆ విషయాన్ని ఇలా కన్ఫామ్ చేసేశావా బ్రో అంటున్న నెటిజన్లు....


Advertisement

Next Story

Most Viewed