- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BC Gurukula students : నేషనల్ హైవేపై బీసీ గురుకుల విద్యార్థుల ఆందోళన
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నేషనల్ హైవేపై బైఠాయించారు. ఆహారం సరిగ్గా ఉండటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని, తమకు న్యాయం చేయాలని వెల్లడించారు. విద్యార్థుల ఆందోళనతో.. రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పారు. అనంతరం ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు.
Next Story