- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cm Chandrababu: అది దౌర్భాగ్య పాలన: మాజీ సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్ల పాలనను గుర్తు చేసుకుని మాజీ సీఎం జగన్(Former CM Jagan)పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అది దౌర్భాగ్య పాలన అంటూ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం(Free gas cylinders scheme)ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు వస్తే పరదాలు, చెట్లు నరకడం ఉండకూదన్నారు. గత ప్రభుత్వం సభ పెడితే ఐదారు జిల్లాల నుంచి జనాలను సమీకరించేవాళ్లని ఎద్దేవా చేశారు. చెడుమీద మంచి గెలిచిన రోజు దీపావళి(Diwali) అని తెలిపారు. 45 ఏళ్ల తర్వాత మళ్లీ అతి పెద్ద విజయం ప్రజలకు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేసి రిలీజ్ చేసిన రోజు ఈ ఏడాది దీపావళి వచ్చిందని గుర్తు చేశారు. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి పోరాటం చేసి రాష్ట్రాన్ని కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో స్వేచ్ఛలేదని గుర్తు చేశారు. గతంలో అక్రమంగా వ్యవహరించిన వారిని ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, చట్టపరంగా వారందరికి శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.