ISRO: లేహ్ లో అనలాగ్ మిషన్ ప్రారంభం

by Shamantha N |   ( Updated:2024-11-01 10:16:19.0  )
ISRO: లేహ్ లో అనలాగ్ మిషన్ ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO).. తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లడఖ్ లేహ్‌లో ప్రారంభించింది. భారత చరిత్రలో ఇదో మైలురాయిగా నిలవనుంది. హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌, ఆకా(AAKA) స్పేస్‌ స్టూడియో, లడఖ్‌ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే(IIT Bombay), లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషన్‌ చేపట్టింది. మిషన్‌లో భాగంగా ఇస్రో లేహ్‌లో ఓ స్పేస్‌ను సృష్టిస్తుంది. ఇందులో మరో గ్రహంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. దాంతో భూమికి దూరంగా ఉన్న ప్రదేశాల్లోని బేస్‌ స్టేషన్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇస్రో సన్నాహాలు చేయనున్నది.

గగన్ యాన్

భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఉన్న గగన్‌యాన్ మిషన్(Gaganyaan program) ని భారత్ ప్రారంభించింది. ఈ మిషన్ లో భాగంగా తొలిసారిగా ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి పంపనుంది. కాగా.. ఈ పరిస్థితుల్లో అనలాగ్‌ మిషన్‌ కీలకంగా మారనున్నది. లడఖ్‌లోని వాతావరణ పరిస్థితులు కొంత వరకు చంద్రుడు, మార్స్‌ పరిస్థితులను పోలి ఉంటాయి. చల్లని, పొడి వాతావరణం, ఎక్కువ ఎత్తు ఉండడంతో ఇక్కడి నుంచి దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల కోసం సన్నాహాలకు ఉపయోగకరంగా మారనుంది. అనలాగ్‌ మిషన్‌లో పాల్గొనేవారంతా ఇతర గ్రహాలు, స్పేస్‌షిప్‌ల్లో ఉండే పరిస్థితులు అనుభవిస్తారు. భవిష్యత్‌లో ఇక్కడే అంతరిక్ష యాత్రకు సిద్ధం కానున్నారు. నిర్వహణ, మానసిక స్థితిని సైతం శాస్త్రవేత్తలు పర్యవేక్షించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed