Bandi Sanjay : బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పాదయాత్రలు : బండి సంజయ్

by Y. Venkata Narasimha Reddy |
Bandi Sanjay : బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పాదయాత్రలు : బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ నది పునరుజ్జీవనం(Revival of the Moose River)పేరుతో ఒకరు, ప్రజా సమస్యలంటూ మరోకరు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు పథకం ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) , కేటీఆర్ (KTR)లు చెరోవైపు పాదయాత్ర(Padayatra)లకు సిద్ధమవుతున్నారన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ళ పాలనలో ప్రజలను మోసం చేసి, వేధించిన దానిని చెప్పుకుంటూ కేటీఆర్, ఎన్నికల హామీలను అమలు చేయడం లేదంటూ రేవంత్ రెడ్డిలు పాదయాత్ర చేయాలని ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళనకు పెట్టే లక్షన్నర కోట్లతో ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా, రాహుల్ గాంధీ బావ వధేరా కాంట్రాక్టు కోసం మూసీ ప్రక్షాళన జపం చేస్తున్నారని విమర్శి్ంచారు. గతంలో తన ప్రజా సంగ్రామ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్ని్ంచిన బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు పాదయాత్ర చేస్తుండటం విడ్డూరమన్నారు. అసలు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని, గ్రూ ప్ 1, హైడ్రా, మూసీ, వరదలు, ఉద్యోగ సమస్యలప్పుడు కూడా కేసీఆర్ బయటకు రాలేదని, వాళ్ల కుటుంబ సభ్యులకు ఆపదొస్తే తప్పా ఆయన బయటకు రావడం లేదన్నారు. నాయకుడు లేని నావ మాదిరిగా బీఆరెఎస్ పరిస్థితి ఉందని, అహంకార కేటీఆర్ వైఖరిని ప్రజలు అసహ్యి్ంచుకుంటున్నారన్నారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళి్ంచేందుకు నాడు కేసీఆర్ చేసినట్లుగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శి్ంచారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటేనని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన ధరణి, కాళేశ్వరం, విద్యుత్తు కొనుగోళ్లు, గొర్రెల స్కీమ్, ఫార్ములా రేస్ వంటి అన్ని స్కామ్ లపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే నిదర్శనమన్నారు. జన్వాడా ఫామ్ హౌస్ కేసు చల్లబడిందన్నారు. ఒక్క కేసులోనూ బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఇప్పటిదాకా నోటీస్ లు ఇవ్వలేదన్నారు. దీపావళికి ముందు బాంబులు పేలుతాయని మంత్రుల మాట మేరకు ఏ బాంబులు పేలలేదని చురకలేశారు. ఎమన్నా అంటే కేంద్రం సహకరించడం లేదంటారని వ్యంగ్యాస్త్రాలు వేశారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి పాలన సాగినట్లుగానే కాంగ్రెస్ అవినీతి పాలన సాగుతోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఇండ్లను ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లబ్ధిదారుల జాబితా వెల్లడించడం లేదన్నారు. రుణమాఫీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హైడ్రా అన్నారని, దానిపై ప్రజావ్యతిరేకత రావడంతో మూసీ పునరుజ్జీవనం అంటున్నారని, దీనిపై కూడా వ్యతిరేకత రావడంతో మరో సమస్య తెరపైకి తెస్తారని విమర్శి్ంచారు. ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ రెడ్డికి పాదయాత్ర చేసే దమ్ముందా అని సవాల్ చేశారు. 29జీవోను రద్ధు చేయడం లేదని, ఉద్యోగ హామీల మేరకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆచరణ సాధ్యం కాని హామిలిచ్చిన కాంగ్రెస్ ఓడిపోయిందని, కర్ణాటకలోనూ ఉచిత బస్ పథకం ఎత్తేసే పరిస్థితి ఉందన్నారు. ప్రధాని మోడీపై యుద్ధం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఆరు గ్యారంటీల అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశ, విదేశాల్లో హిందువులపై దాడులు జరిగితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు..కానీ ఇక్కడ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందించడం లేదని బండి సంజయ్ విమర్శి్ంచారు. బంగ్లాదేశ్ లో హిందువుల దాడుల పట్ల కాంగ్రెస్ స్పందించకపోవడాన్ని సంజయ్ తప్పబట్టారు.

Advertisement

Next Story

Most Viewed