Mohanlal: మోహన్ లాల్ ‘లూసిఫర్-2’ మూవీ రిలీజ్ తేదీ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల

by Hamsa |   ( Updated:2024-11-01 11:38:08.0  )
Mohanlal: మోహన్ లాల్ ‘లూసిఫర్-2’ మూవీ రిలీజ్ తేదీ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)తెరకెక్కిస్తున్న ‘లూసిఫర్-2’ (Lucifer-2)చిత్రంలో మోహన్ లాల్(Mohanlal) హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘లూసిఫర్‌’(Lucifer)కి సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తమిళ బ్యానర్ లైకా ప్రొడక్షన్స్‌(Lyca Productions )తో కలిసి ఆశీర్వాద్ సినిమాస్ దీనిని నిర్మిస్తున్నారు. లూసిఫర్-2 మూవీ తెలుగు, హిందీ, కన్నడ తమిళతో పాటు పలు భాషల్లో విడుదల కాబోతుంది.

తాజాగా, ‘లూసిఫర్-2’ (Lucifer-2) విడుదల తేదీని మేకర్స్ వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటనను షేర్ చేశారు. ఈ పోస్టర్‌ను మోహన్ లాల్(Mohanlal) తన ‘X’ వేదికగా షేర్ చేశారు. అయితే అందులో ఏముందంటే.. ఓ వ్యక్తి నిల్చొని ఉండగా.. అతని వీపుపై ఏదో ఆకారంతో ఓ పిక్స్ ఉంది. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story