- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pc Ghosh Commission: మరోసారి కాళేశ్వరం కమిషన్ గడువును పొడిగింపు!
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అవకతవకలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం కనిపిస్తున్నది. ఈ కమిషన్ ప్రస్తుత గడువు నేటితో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, మరో రెండు నెలల పొడిగిస్తూ నేడో రేపో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఎక్స్‌డెంట్ చేయనున్నట్లు సమాచారం.
కీలక దశలో విచారణ:
కాళేశ్వరం అంశంలో జరిగిన అవకతవకలపై వంద రోజుల్లో నివేదిక ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అప్పట్లో నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే కమిషన్ ఏర్పాటు చేసిన సమయంలో ఇచ్చిన మొదటి వంద రోజుల గడువు ఈ ఏడాది జూన్ నెలాఖరుతో పూర్తయింది. కానీ విచారించాల్సిన అధికారులు ఎక్కువ మంది ఉండటంతో విచారణ పూర్తి కాలేదు. దాంతో ప్రభుత్వం గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ క్రమంలో టెక్నికల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులు ఆలస్యం కావడంతో మరో రెండు నెలలను పొడిగించింది. ఆ గడువు నేటితో ముగియనున్నది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లను ఓపెన్ కోర్టులో విచారిస్తున్న తరుణంలో విచారణ కీలక దశకు చేరుకున్నది. దీంతో కమిషన్ గడువును మరోసారి పొడిగించాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వం పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.