- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lokesh : ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ గా లోకేష్ కు ఆమెరికాలో స్వాగతం
దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కు అమెరికా(America)లోని టీడీపీ నాయకులు ఫ్యూచర్ చీప్ మినిస్టర్(future Chief Minister) అంటూ స్వాగతం పలికిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. నారా లోకేశ్ ఫ్యూచర్ మినిస్టర్ అంటూ రాసిన భారీ స్వాగత ఫ్లెక్సీని గగన తలాన జెట్ విమానానికి అనుసంధానించి ఆకాశంలో రెపరెప లాడించడం ద్వారా అమెరికా టీడీపీ ఎన్నారైలు తమ అభిమానాన్ని చాటుకుని ఘన స్వాగతం పలికారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా తన తండ్రి, ప్రస్తుత సీఎం చంద్రబాబును అప్పటి వైఎస్ జగన్ వైసీపీ ప్రభుత్వం జైలులో పెట్టిన సందర్భంలో, తనను కూడా కేసుల విచారణతో వేధించిన క్రమంలో అధైర్యపడకుండా పార్టీని నడిపించారు. చంద్రబాబు అరెస్టుపై న్యాయ, ప్రజాపోరాటలను నిర్వహించడంలో, జాతీయ స్థాయిలోనూ మద్ధతు కూడగట్టడంలోనూ, యువ గళం పాదయాత్రతో జనంతో మమేకం కావడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. గతంతో పోల్చితే లోకేశ్ రాజకీయంగా పరిణితి కనబరుస్తున్నారన్న పేరు గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెరాకాలోని టీడీపీ అభిమానులు లోకేశ్ ను భవిష్యత్తు సీఎంగా పేర్కొన్నారని టీడీపీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి.
అమెరికా పర్యటనలో ఉన్న లోకేశ్ కు వెళ్ళిన ప్రతిచోట అక్కడి ఏపీ ఎన్నారైలు ఘన స్వాగతాలతో సందడి చేస్తున్నారు. విదేశీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా సాగుతోన్న లోకేశ్ అమెరికా పర్యటన అక్టోబర్ 25న మొదలు కాగా నవంబర్ 1వ తేదీతో ముగియ్యనుంది. తన అమెరికా పర్యటనలో అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నారా లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ పై నుంచి పూలవర్షం కురిపించి ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నారా లోకేశ్ మాడ్లాడుతూ మీ అభిమానం చూస్తుంటే నేను అట్లాంటాలో ఉన్నానా, అమలాపురంలో ఉన్నానా అనే డౌట్ వస్తోందన్నారు. ఎన్ఆర్ఐలు కూడా సైకో జగన్ బాధితులేనన్నారు. రెడ్ బుక్లో ఒక చాప్టర్ అయిపోయిందని, రెండోది ఓపెన్ అయిందని, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నారైలు ఏపీలో పెట్టుబడి పెట్టండి, మీకు అండగా నిలిచే బాధ్యత నాదని, అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.