- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sexual Harassment: ‘మీ వాట్సాప్ ఫొటో చాలా బాగుంది.. ఎంత డబ్బు అడిగినా ఇస్తా’
దిశ, కోదాడ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ(Minister Uttam Kumar Reddy PA)ను అంటూ ఓ వ్యక్తి కోదాడ సీడీపీఓ కార్యాలయంలోని మహిళా సూపర్వైజర్‌కు ఫోన్ చేసి రెచ్చిపోయాడు. ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కోదాడ మహిళా సూపర్వైజర్ వివరాల ప్రకారం. ‘మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏను అంటూ ఇటీవల ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశారు. మీ ఆఫీస్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగాడు. అసలు మీరు ఎవరు? అని డౌట్ వచ్చి నేను గట్టిగా అడిగాను. దీంతో మీ వాట్సాప్ డీపీ(Whatsapp DP) చాలా బాగుంది. ఆ ఫొటోలో చాలా అందంగా ఉన్నారు. ఎంత డబ్బు అడిగినా ఇస్తా. లొంగిపోండి అని వేధించాడు.
ఇటీవలే జైలు నుంచి విడుదల అయ్యాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని బెదిరించాడు’ అని బాధితురాలు ఆవేదన చెందింది. కాగా. బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి కోదాడ సీడీపీఓ కార్యాలయానికి మాత్రమే కాకుండా మెదక్ ఐసీడీఎస్ పరిధిలోని మరి కొంతమంది సూపర్వైజర్లకు కూడా ఫోన్లు చేసి లైంగిక వేధింపుల(Sexual harassment)కు పాల్పడినట్లు సమాచారం. వాయిస్ మెసేజ్‌లో ఆ వ్యక్తి తీరు చూస్తుంటే మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా వ్యవహరించడం అతి దారుణంగా ఉంది. ఇటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మహిళలు కోరుతున్నారు.