- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bibek Debroy: ప్రధాని మోడీ ఎకనామిక్ కౌన్సిల్ చీఫ్ బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఎకనామిస్ట్ (Economist), ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) ప్రభుత్వంలో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ దెబ్రాయ్ (69) (Bibek Debroy) శుక్రవారం కన్నుమూశారు. భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. భారత ఆర్థిక వ్యవస్థకు విస్తృత కృషి చేశారు దెబ్రాయ్. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. బిబేక్ దెబ్రాయ్ గొప్ప ఆర్థిక పండితుడని కొనియాడారు. అంతేకాదు.. చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి రంగాల్లోనూ ప్రావీణ్యం ఉందని, తన రచనల ద్వారా ఎంతోమందిని ఆకట్టుకున్నారని తెలిపారు.
పద్మశ్రీ (Padmasri Award) గ్రహీత అయిన బిబేక్ దెబ్రాయ్ 1979 నుంచి 1984 వరకూ కోల్ కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో తన విద్యావృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత పూణెలోని గోఖలే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ లో చేరి 1987 వరకూ పనిచేశారు. ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో 1993 వరకు పనిచేశారు. 1993లో దెబ్రాయ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP) ప్రాజెక్ట్‌కి డైరెక్టర్ అయ్యారు. చట్టపరమైన సంస్కరణలపై దృష్టి సారించారు. 1994 నుండి 1995 వరకు ఆర్థిక వ్యవహారాల శాఖలో కొంతకాలం పనిచేసిన ఆయన.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ 1995 - 1996 వరకు, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంటెంపరరీలో 1997 నుండి 2005 వరకు అధ్యయనాలు చేశారు. 2006 వరకు PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో పనిచేశారు. ఆ తరువాత సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో చేరారు. 2007 నుండి 2015 వరకు అక్కడే ఉన్నారు. జూన్ 5, 2019 వరకు NITI ఆయోగ్‌లో సభ్యుడిగా ఉన్నారు.