- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Burj Khalifa : బుర్జ్ ఖలీఫాపై 'దీపావళి' వెలుగులు! వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా Diwali దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన Burj Khalifa బుర్జ్ ఖలీఫాపై దీపావళికి సంబంధించిన పలు విజువల్స్‌ను ప్రదర్శింనట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 31 వ తేదీ రాత్రి బుర్జ్ ఖలీఫాపై దీపావళి విషెస్ విజువల్స్ ప్రదర్శించారని హసన్ సజ్వానీ అనే నెటిజన్ x ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. బుర్జ్ ఖలీఫాపై హిందీ, ఇంగ్లీష్ భాషలో హిందువులందరికీ దుబాయ్ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోకు 30 వేలకు పైగా లైక్స్, 5 వేలకు పైగా రీ ట్వీట్ చేశారు. కాగా, హిందువులు పవిత్రంగా జరిపే దీపావళి పండుగకు దుబాయ్ దేశంలో అత్యంత గౌరవం దక్కింది. మునుపెన్నడూ లేని విధంగా దీపావళి నేపథ్యంలో బుర్జ్ ఖలీఫాతో పాటు ప్రభుత్వ భవనాలు రంగురంగుల లైటింగ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీంతో Dubai దుబాయ్ వంటి దేశాల్లో మన పండుగలకు గౌరవం దక్కుతొందని ఇండియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.