KTR: రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నా: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-11-01 03:54:48.0  )
KTR: రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నా: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తాము మూసీ బ్యూటిఫికేషన్‌ (Musi Beautification)కు వ్యతిరేకం కాదని.. లూటిఫికేషన్‌కు వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం #Ask KTR క్యాంపెయిన్‌లో భాగంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవం (Musi Renaissance) పేరుతో రూ.కోట్లలో నిధులు మళ్లించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. పేదవాళ్లకు మంచి జరిగితే సంతోషిస్తామని.. కానీ, మూసీ సుందరీకరణ పేరుతో నిధులు లూఠీ చేసి ఢిల్లీకి సూటుకేసులు మోయడం తగదని కామెంట్ చేశారు. రాష్ట్రంలో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కేసీఆర్ (KCR) ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అందుకు కేటీఆర్ (KTR) సమాధానమిస్తూ.. కేసీఆర్ (KCR) పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. పార్టీ కార్యక్రమాల విషయంలో తమకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. 2025 తరువాత కేసీఆర్ (KCR) ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు వారికి కాస్త సమయం ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగోలేవని, ప్రజా జీవితంలో నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఒకనొక దశలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని పేర్కొన్నారు. కానీ, ప్రజల కోసం నిలబడి పోరాడుతున్నానని కేటీఆర్ (KTR) అన్నారు.

Advertisement

Next Story