Israyel Hamas war: హిజ్బొల్లాపై ప్రతీకారం తప్పదు..ఇజ్రాయెల్ వార్నింగ్

by vinod kumar |
Israyel Hamas war: హిజ్బొల్లాపై ప్రతీకారం తప్పదు..ఇజ్రాయెల్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్‌లోని ఫుట్‌బాల్ మైదానంపై హిజ్బొల్లా దాడి చేయగా..12 మంది ఇజ్రాయెలీలు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సీరియస్ అయింది. హిజ్బొల్లా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. ఇప్పటి వరకు చూడని విధంగా ప్రతీకారం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ హిజ్బొల్లా అన్ని హద్దులను దాటిందనడంలో సందేహం లేదన్నారు. దీనికి ఖచ్చితంగా తగిన సమాధానం ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థతో యుద్ధం ప్రారంభానికి చాలా దగ్గరగా ఉన్నామని తెలిపారు.

కాగా, ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బొల్లా శనివారం గోలన్ హైట్స్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో లెబనాన్ నుంచి రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఈ దాడికి తాము పాల్పడలేదని హిజ్బొల్లా ప్రకటించింది. అయితే హిజ్బొల్లా మాత్రమే ఉపయోగించే ఫలక్-1 రాకెట్లతో ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. దీంతో హిజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడిని లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో వివాదాన్ని నియంత్రించే లక్ష్యంతో దౌత్య ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న అమెరికా ఖండించింది.

Advertisement

Next Story

Most Viewed