BREAKING: ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హతం

by Satheesh |   ( Updated:2024-07-31 04:10:37.0  )
BREAKING: ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హతం
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్- టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హమాస్ గ్రూప్ చీఫ్ ఇస్మాయిల్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ముట్టుబెట్టాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇస్మాయిల్ తలుదాచుకున్నట్లు సమాచారం తెలుసుకున్న ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో హమాస్ చీఫ్ హతమయ్యాడు. ఇస్మాయిల్ మృతిని ఇరాన్ నిర్ధారించినట్లు సమాచారం. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కీలక దశలో ఉన్న వేళ ఇస్మాయిల్ మృతి హమాస్‌కు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. అయితే, తమ దేశ పరిధిలో మెరుపు దాడులు చేసి ఇస్మాయిల్‌ను అంతమొందించడంతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏమైనా రివేంజ్ ఎటాక్ ప్లాన్ చేస్తుందా అని పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తమ చీఫ్ హత్యకు ప్రతీకారంగా హమాస్ దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యింది. టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్‌కు ఇరాన్ మద్దతు పలుకుందనే విషయం బహిరంగా సత్యమే.

Advertisement

Next Story

Most Viewed