- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel-Hezbollah: హిజ్బుల్లాకు మరో బిగ్ షాక్..నస్రల్లా వారసుడు హతం..!
దిశ, వెబ్‌డెస్క్:ఇజ్రాయిల్(Israel)-హిజ్బుల్లా(Hezbollah) మధ్య గత కొన్ని రోజులుగా భీకరమైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాల(Militant Bases) అంతమే లక్ష్యంగా ఇజ్రాయిల్ సైన్యం(Israeli Army) దాడులను మరింత తీవ్రతరం చేసింది.ఇప్పటికే లెబనాన్(Lebanon) రాజధాని బీరూట్(Beirut)పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది.ఈ దాడుల్లో ఇప్పటివరకు రెండు వేలకి పైగా హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది.ఇజ్రాయిల్ గత వారం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా(Hassan Nasrallah)ని బీరూట్ వైమానిక దాడుల్లో హతమార్చిన విషయం తెలిసిందే.
హసన్ నస్రల్లా మరణించిన తర్వాత అతడి వారసుడిగా,హిజ్బుల్లా చీఫ్‌గా చెప్పబడుతున్న హషీమ్ సఫీద్దీన్(Hashim Safideen) కూడా ఇజ్రాయిల్ దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్నీ సౌదీ వార్తా సంస్థ అల్ హదత్(Al Hadat)వెల్లడించింది.దక్షిణ బీరుట్(South Beirut)లోని హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్(Intelligence Headquarters)పై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో అతను హతమైనట్లు తెలుస్తోంది.ఈ దాడుల్లో సఫీద్దీన్ తో పాటు హిజ్బుల్లాకు చెందిన ఉన్నతస్థాయి నేతలు కూడా మరణించినట్లు సమాచారం.హషీమ్ సఫీద్దీన్ 1960లో దక్షిణ లెబనాన్ లో జన్మించాడు.హిజ్బుల్లా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా అతను పరిగణించబడ్డాడు.ప్రస్తుతం హిజ్బుల్లా చీఫ్‌గా సఫీద్దీన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే దాడుల్లో మరణించాడు.