WHO : పోలియో వ్యాక్సినేషన్ కోసం కాల్పుల విరమణ

by Hajipasha |
WHO : పోలియో వ్యాక్సినేషన్ కోసం కాల్పుల విరమణ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమై కాలుష్యమయంగా మారిన గాజాలో పోలియో మహమ్మారి మళ్లీ పురుడుపోసుకుంది. ఈనేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పోలియో వ్యాక్సినేషన్‌కు నడుం బిగించింది. ఇందుకు సహకరించాలంటూ ఇజ్రాయెల్, హమాస్‌లతో డబ్ల్యూహెచ్‌వో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పోలియో వ్యాక్సిినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్న గాజా ప్రాంతంలోని ప్రతీ జోన్‌ పరిధిలో మూడురోజులు చొప్పున తాత్కాలిక కాల్పుల విరమణను పాటించేందుకు హమాస్, ఇజ్రాయెల్ అంగీకరించాయని డబ్ల్యూహెచ్‌వో వర్గాలు వెల్లడించాయి.

తొలుత సెంట్రల్ గాజాలో, రెండో విడతలో దక్షిణ గాజాలో, చివరగా ఉత్తర గాజాలో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా దాదాపు 6.40 లక్షల మంది పాలస్తీనా పిల్లలకు పోలియో టీకాలు వేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed