- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Iran : ఇజ్రాయెల్‌ను శిక్షించే చట్టపరమైన హక్కు మాకుంది : ఇరాన్
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. గత వారం తెహ్రాన్‌లో జరిగిన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యపై ప్రతిస్పందించే చట్టపరమైన హక్కు తమకు ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నాసర్ కనాని స్పష్టం చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఇజ్రాయెల్ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘‘ఇజ్రాయెల్‌లోని జియోనిస్ట్ పాలనను శిక్షించే చట్టపరమైన హక్కు ఇరాన్‌కు ఉంది. దాన్ని అనుమానించే హక్కు ఎవరికీ లేదు’’ అని కనాని తేల్చి చెప్పారు. ‘‘పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచిన చరిత్ర ఇరాన్‌కు లేదు.
ఇజ్రాయెల్ దేశమే అలాంటి చేష్టలతో రెచ్చిపోతోంది. ఆ క్రమంలోనే ఇటీవల తెహ్రాన్‌లో ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది’’ అని ఆయన ఆరోపించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు తెహ్రాన్‌కు వచ్చిన ఇస్మాయిల్ హనియేపై షార్ట్ రేంజ్ ప్రొజెక్టయిల్స్‌తో ఇజ్రాయెల్ దాడి చేసి హత్యకు పాల్పడిందని ఇటీవలే ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై దాడి చేయనున్న అంశంపై జోర్డాన్, ఈజిప్ట్, ఒమన్, ఖతార్ సహా పలు అరబ్ దేశాలకు ఇరాన్ సమాచారం అందించినట్లు తెలుస్తోంది.