- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 చీజ్ డెజర్ట్‌ల లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో భారత ‘రాసమలై’
దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 'టాప్ 10 ఉత్తమ చీజ్ డెజర్ట్‌ల' జాబితాలో ఇండియాలోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ‘రాసమలై’ రెండో స్థానాన్ని సంపాదించింది. రసమలై స్వీట్ చాలా మందికి ఇష్టం. దీనిని పాలు, పంచదార, కుంకుమ పువ్వు, నిమ్మరసం మొదలగు వాటితో తయారుచేస్తారు. దీనిని తినడం వలన కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. హోలీ, దీపావళి వంటి పండగల సమయాల్లో దీనిని ఎక్కువగా తయారు చేస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ చీజ్ డెజర్ట్‌లలో ఒకటిగా రాసమలై గుర్తింపు పొందడం భారతదేశం గొప్ప పాక వారసత్వానికి, ఈ రుచికరమైన తీపి వంటకం నిదర్శనం అని పలువురు పేర్కొన్నారు.
టేస్ట్ అట్లాస్ అత్యుత్తమ చీజ్ డెజర్ట్‌ల జాబితాలో మొదటి స్థానంలో పోలాండ్‌కు చెందిన సెర్నిక్ నిలిచింది. ఇది గుడ్లు, చక్కెర, ట్వరోగ్‌తో తయారు చేయబడింది. మూడో స్థానంలో గ్రీస్‌కు చెందిన స్ఫకియానోపిటా, నాలుగో స్థానంలో అమెరికా డెజర్ట్ న్యూయార్క్ తరహా చీజ్, ఐదో స్థానంలో జపాన్‌కు చెందిన జపనీస్ చీజ్ ఉన్నాయి. టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఆహార వంటకాల రుచి, వాటి గొప్పతనాన్ని అందిస్తుంది.