‘ఇండియా’ పేరు మార్పుపై చైనా రియాక్షన్‌.. దానిపై ఫోకస్ చేయాలని సూచన

by Vinod kumar |
‘ఇండియా’ పేరు మార్పుపై చైనా రియాక్షన్‌.. దానిపై ఫోకస్ చేయాలని సూచన
X

బీజింగ్‌ : ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పొరుగుదేశం చైనా కూడా స్పందించింది. భారత్‌కు డ్రాగన్ కొన్ని ఉచిత సలహాలను ఇచ్చింది. ‘‘జీ20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న ఈ అవకాశాన్ని దేశ ఆర్థిక వ్యవస్థను దౌడు తీయించేందుకు భారత్ వాడుకోవాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. అంతర్జాతీయంగా ఇండియా ప్రభావాన్ని పెంచుకోవాలి.

దేశం పేరును మార్చడం కంటే ఇవన్నీ భారత్ చేస్తే మంచిది’’ అని సూచిస్తూ.. చైనా అధికారిక వార్తాపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేసింది. ‘‘దేశం పేరు ఇండియా లేదా భారత్ ఏదైనా కావచ్చు.. ఆ పేరు కంటే దేశ ఆర్థిక వ్యవస్థకు వైభవం కల్పించే సంస్కరణలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story

Most Viewed