ఈసీ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట

by Javid Pasha |
ఈసీ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఈసీ కార్యాలయం ముందు నిరసన కేసులో అరెస్ట్ చేయకుండా లాహోర్ హైకోర్టు సోమవారం బెయిల్ కు ఆమోదం తెలిపింది. ప్రత్యక్షంగా విచారణకు హజరు కావాల్సి ఉండడంతో గంటల కొద్ది నాటకం తర్వాత ఆయన కోర్టుకు చేరుకున్నారు. అంతకుముందు కోర్టు బయట ఇమ్రాన్ మద్దతుదారులు అనుకూలతో నినాదాలతో హోరెత్తింది. ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత ప్రదర్శనపై గంటల తరబడి రాజకీయ నాటకం తర్వాత చివరకు కోర్టు గదికి చేరుకున్నాడు.

పాకిస్తాన్ మాజీ ప్రధానికి మద్దతుగా నినాదాలు చేస్తూ పీటీఐ మద్దతుదారుల గుంపు లాహోర్ హైకోర్టు వెలుపలి ప్రాంగణాన్ని ముంచెత్తింది. గత ఏడాది నిషేధిత నిధుల కేసులో పాక్ ఈసీ ఇమ్రాన్‌ను అనర్హులుగా ప్రకటించింది. దీంతో ఎన్నికల సంఘం వెలుపల ఆయన కార్యకర్తలతో చేసిన హింసాత్మక నిరసనలకు సంబంధించిన కేసులో బెయిల్ కోసం దాఖలు చేశారు.


Advertisement

Next Story

Most Viewed