హంగేరియన్ అధ్యక్షురాలు రాజీనామా: వారికి క్షమాపణలు చెప్పిన నొవాక్

by samatah |
హంగేరియన్ అధ్యక్షురాలు రాజీనామా: వారికి క్షమాపణలు చెప్పిన నొవాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: హంగేరియన్ దేశ అధ్యక్షురాలు కాటలిన్ నొవాక్ తన పదవికి రాజీనామా చేశారు. బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తడంతో ఆమె రిజైన్ చేశారు. ‘పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్ష లభించిందన్న వార్త చాలా మందిని బాధించింది. నేను ఎల్లప్పుడూ పిల్లల భద్రతకు అనుకూలంగా ఉంటాను’ అని తెలిపారు. తప్పు జరిగినందుకు తనను క్షమించాలని ప్రజలను కోరారు. కాగా, పిల్లలపై దారుణాలకు పాల్పడిన చిల్డ్రన్ హోమ్ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌కు 2023 ఏప్రిల్‌లోక్షమాభిక్ష లభించింది. అప్పటి నుంచి నొవాక్‌పై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఈ క్రమంలోనే ఈ నెల 8న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. భారీ సంఖ్యలో ప్రజలు అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. నొవాక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె పదవికి రిజైన్ చేశారు. కటాలిన్ 2022 లో హంగేరీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed