ఖలిస్థానీ టెర్రరిస్ట్ ‘నిజ్జర్’కు అండగా కెనడా ఎంపీ.. వెలుగులోకి తెచ్చిన భారత నిఘా వర్గాలు

by Vinod kumar |
ఖలిస్థానీ టెర్రరిస్ట్ ‘నిజ్జర్’కు అండగా కెనడా ఎంపీ.. వెలుగులోకి తెచ్చిన భారత నిఘా వర్గాలు
X

ఒట్టావా : కెనడాలో హత్యకు గురైన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌‌తో ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు సన్నిహితుడైన ఎంపీ సుఖ్ ధాలివాల్‌కు ఉన్న సంబంధాలపై భారత నిఘా వర్గాలు సంచలన సమాచారాన్ని వెల్లడించాయి. ఈమేరకు వివరాలతో భారత జాతీయ మీడియాలో వార్తా కథనాలు ఆదివారం ప్రసారమయ్యాయి. వాటి ప్రకారం.. వాస్తవానికి ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ నో ఫ్లై లిస్టులో ఉన్నాడు. అయినా అతడికి కెనడాలో శాశ్వత నివాసఖలిస్థానీ టెర్రరిస్ట్ ‘నిజ్జర్’కు అండగా కెనడా ఎంపీ.. వెలుగులోకి తెచ్చిన భారత నిఘా వర్గాలుఅనుమతులు వచ్చేలా సహాయ సహకారాలు అందించింది సుఖ్ ధాలివాలే అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.

కెనడాలోని సిక్కుల మద్దతు, పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా సుఖ్ ధాలివాల్ కు ట్రూడో కెనడా ఇమ్మిగ్రేషన్ కమిటీ ఛైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టారని ఆరోపించాయి. కెనడా కేంద్రంగా భారత్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహించే మాఫియాను నడుపుతున్న నిజ్జర్ తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సుఖ్ ధాలివాల్‌కు ఇచ్చుకునే వాడని భారత ఇంటెలీజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. నాలుగు నెలల క్రితం ధాలివాల్ పాకిస్థాన్‌లోని లాహోర్ పర్యటనకు వెళ్లి వచ్చారు. పాక్ నుంచి కెనడాకు తిరిగొచ్చిన తర్వాతే.. నిజ్జర్ హత్య అంశంతో ఖలిస్థానీ ఓటు బ్యాంకు మద్దతును పొందొచ్చనే ఐడియాను ట్రూడోకు ధాలివాల్ ఇచ్చారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed