Helicopter Crash: ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కుప్పకూలింది..తాజాగా వెల్లడించిన ఇరాన్ ఆర్మీ అధికారులు

by Maddikunta Saikiran |
Helicopter Crash: ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కుప్పకూలింది..తాజాగా వెల్లడించిన ఇరాన్ ఆర్మీ అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) గత మే నెలలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. మే 19న ఇబ్రహీం రైసీ అజర్ బైజాన్ విదేశంగా శాఖ మంత్రి హోస్సేన్ తో కలిసి ఇరు దేశాలు నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే డ్యామ్ లను ప్రారంభించాడానికి వెళ్లారు.తిరిగి వస్తున్న క్రమంలో అజర్ బైజాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో రైసీ అకాల మరణం చెందారు. కాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న గొడవల నేపథ్యంలో మృతికి ఇజ్రాయెల్ దేశమే కారణమని తొలుత ఆరోపణలు వినిపించాయి.

ఈ క్రమంలో ఇబ్రహీం రైసీ మృతికి గల కారణాలను ఇరాన్ కు చెందిన ఓ అధికారిక వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైందని తెలిపింది. అలాగే పరిమితి కంటే ఎక్కువ మంది హెలికాప్టర్ లో ప్రయాణించడం వల్ల హెలికాప్టర్ బరువును తట్టుకోలేకపోయిందని అందువల్లే హెలికాప్టర్ పర్వతంపై కూలిపోయిందని ఆ వార్త సంస్థ తెలిపింది.దీంతో అయతుల్లా రైసీ హెలికాప్టర్ క్రాష్ కేసులో దర్యాప్తు పూర్తయిందని, ప్రతికూల వాతావరణ పరిస్థితులు అలాగే అధిక బరువు వల్ల ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తమ విచారణలో తేలిందని ఇరాన్ భద్రత అధికారులు తెలిపారు.

Advertisement

Next Story