అమెరికాలో భారీ వర్షాలు.. నలుగురు మృతి

by Rajesh |
అమెరికాలో భారీ వర్షాలు.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌‌డెస్క్: అమెరికా హ్యూస్టన్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. పెనుగాలులకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు పెద్ద సంఖ్యలో విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి జరిగిన ప్రమాదాల్లో మొత్తం నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విమానాశ్రయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లు, వ్యాపార కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Advertisement

Next Story