లైవ్ బులెటిన్ లో న్యూస్ రీడర్ కు హార్ట్ స్ట్రోక్.. వీడియో వైరల్

by Shiva |   ( Updated:2023-03-22 03:43:04.0  )
లైవ్ బులెటిన్ లో న్యూస్ రీడర్ కు హార్ట్ స్ట్రోక్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.వ‌య‌స్సుతో సంబంధం లేకుండా యువ హృదయాలు అకస్మాత్తుగా ఆగిపోవడం పలువురిని ఆందోళ‌నకు కూడా గురిచేస్తున్నాయి. క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సీబీఎస్ న్యూస్ ఛానల్ లో వెథర్ న్యూస్ ప్రెసెంట్ చేసే అలిస్సా కార్ల్సన్ ష్వార్ట్జ్ అనే మహిళ ఉదయం 7 గంటలకు లైవ్ లో వార్తలు చదువుతుండగా హార్ట్ స్ట్రోక్ గురై ఒక్కసారిగా కింద‌ ప‌డిపోయింది. ఆ సమయంలో న్యూస్ యాంకర్లు నికెల్ మదీనా, రాచెల్ కిమ్ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఇప్పుడు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed