- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హమాస్ భీకర దాడి: 24 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: హమాస్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం రోజు రోజుకూ ఉదృతమవుతోంది. తాజాగా హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 24 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి వెల్లడించారు. హమాస్ స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం పేలుడు పదార్థాలు అమర్చుతున్న టైంలో హమాస్ టెర్రరిస్టులు రాకెట్ దాడి చేసినట్టు తెలిపారు. దీంతో ఆ భవనాలు సైనికులపై కూలిపోయినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు సైన్యం తెలిపింది.
ఒకే రోజులో అత్యధిక మరణాలు!
అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఒకే రోజు అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అంతకుముందు దక్షిణ గాజాలో జరిగిన వేర్వేరు దాడుల్లో ముగ్గురు సైనికులు మరణించారు. మరోవైపు ఇజ్రాయెల్ సైనికులు ఓ ఆస్పత్రిపై దాడి చేసి వైద్య సిబ్బందిని అరెస్టు చేసినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం రాత్రి చేసిన ఈ దాడిలో సుమారు 50 మంది మరణించారని పేర్కొంది. అయితే దీనిపై ఇజ్రాయెల్ స్పందించలేదు.
అమాయక పాలస్తీనియన్లను రక్షించండి: ఇజ్రాయెల్‌కు అమెరికా విజ్ఞప్తి
దిశ, నేషనల్ బ్యూరో: అమాయక పాలస్తీనియన్లు, వైద్య సిబ్బందిపై అటాక్ చేయొద్దని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. వైట్ హౌస్ ప్రతినిధి జాన్ రిర్బీ మాట్లాడుతూ..‘అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి. వీలైనంత మేరకు అమాయక ప్రజలు, వైద్య సిబ్బంది, రోగులను రక్షించాలి’ అని ఇజ్రాయెల్‌కు సూచించారు. మరోవైపు హమాస్ ఏజెంట్లు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారని అందుకే దాడులు చేపడుతున్నామని ఇజ్రాయెల్ ఆరోపించగా.. దీనిని హమాస్ ఖండించింది.