Guinness Record : క్రెడిట్ కార్డు అంత వెడల్పుతో నాలుక .. 10 ఏళ్ల తరువాత గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన మహిళ

by Maddikunta Saikiran |
Guinness Record : క్రెడిట్  కార్డు అంత  వెడల్పుతో నాలుక .. 10 ఏళ్ల తరువాత గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బ్రిట్టనీ లకాయో అనే మహిళా నాలుకతో గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఆమె నాలుక దాదాపుగా 3.11 అంగుళాలు (7.90 సెం.మీ) వెడల్పున్నది. దీంతో ఆమె ప్రపంచంలోనే అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్నారు. మనం వాడే క్రెడిట్‌ కార్డ్‌ ఎంత వెడల్పు ఉంటాదో ఆమె నాలుక వెడల్పు దాదాపు అంత వెడల్పున్నది. గతంలో అమెరికాకే చెందిన ఎమిలీ షెలెంకర్‌ పేరిట ఈ రికార్డ్‌ (7.33 సెం.మీ) ఉండేది.దీంతో దాదాపుగా పది సంవత్సరాల తరువాత ఈ రికార్డు బద్దలయింది. కాగా అటార్నీగా పని చేస్తున్న బ్రిట్టనీ తనకు అనూహ్యంగా పెద్ద నాలుక ఉందని తెలిసినప్పటికీ ఆమె అలాంటి రికార్డును కలిగి ఉంటుందని భావించలేదు.ఆమె కుటుంబం తరచుగా ఆమె నాలుక గురించి జోకులు వేసేది. అయితే ఒక రోజు ఆమె స్నేహితుడు బ్రిట్టనీ కి ఎమిలీ ష్లెంకర్ యొక్క వీడియోను పంపాడు. ఆ వీడియో చూసిన తరువాత తన నాలుక వెడల్పు కొలుచుకున్నప్పుడు తనది ష్లెంకర్ కంటే పెద్ద నాలుక అన్న విషయం తెలిసిందన్నారు. ఆమె నాలుక యొక్క కొలతను పరిశీలించిన గిన్నిస్ అధికారులు లాకాయో విశాలమైన నాలుక కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్‌గా ప్రకటించారు.దీంతో ఆమె నాలుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా పురుషులలో వెడల్పు గల నాలుక 8.88 cm (3.49 in) తో USA దేశానికి చెందిన బ్రియాన్ థాంప్సన్ అనే వ్యక్తి మీద గిన్నిస్ రికార్డు ఉంది.

Next Story

Most Viewed