సైబీరియాలోని 'న‌ర‌క ద్వారం' పెద్ద‌ద‌వుతోంది.. ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు?!

by Sumithra |   ( Updated:2022-05-23 08:56:05.0  )
సైబీరియాలోని న‌ర‌క ద్వారం పెద్ద‌ద‌వుతోంది.. ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భూమి మ‌నుషుల‌తో సృష్టించ‌బ‌డ‌లేదని సైన్స్ చెబుతోంది. అలాగే, భూమి శాస్వ‌తంగా ఇలాగే ఉంటుంద‌ని చెప్ప‌లేము. భూమిపైన మ‌నుషులు ఊహించ‌లేని చాలా ప‌రిణామాలు సంభ‌విస్తుంటాయి. వాటిలో ఒక‌టి రష్యాలోని సైబీరియాలో భూమికి స‌హ‌జంగా ప‌డిన ఒక పెద్ద ర‌ధ్రం. ఇది రోజురోజుకూ మ‌రింత పెరుగుతూ భూమిని, దాని చుట్టూ ఉన్న ప్రతిదానిని త‌న‌లో క‌లిపేసుకుంటోంది. ఈ రంధ్రం ఇలా పెరుగుతూనే ఉండ‌టం వ‌ల్ల ఆ చుట్టుప‌క్క‌ల గ్రామ‌స్థులు దానిని 'పాతాళానికి ద్వారం' అని, 'నరకానికి నోరు' అని పిలుస్తున్నారు. యాకుటియాలోని బటాగేలో ఉన్న స్థానికులు ఇటీవ‌ల ఈ ర‌ధ్రం ప‌రిథి మ‌రింత విస్త‌రిస్తున్న‌ట్లు గ‌మనించారు.

అంత‌ర్జాతీయంగా 'బటగైకా క్రేటర్' అని పిలిచే ఈ ప్రాంతంలో ఇలాంటి ప‌రిణామం ఉన్న‌ట్లు 1980ల్లో క‌నుగొన్నారు. ప్ర‌స్తుతం, బిలం ఒక కిలోమీటరు పొడవు, 100 మీటర్ల లోతుకు చేరుకుంది. 2.58 మిలియన్ సంవత్సరాల క్రితం క్వాటర్నరీ ఐస్ ఏజ్‌(మంచు యుగం)లో గడ్డకట్టిన భూగ్ర‌హ‌ మంచు కరుగుతున్న కార‌ణంగా ఈ భారీ బిలం ఏర్పడిందని బ్రిటీష్ వార్తాపత్రిక ది డైలీ మిర్రర్ నివేదించింది. 1960లలో ఆ చుట్టుప‌క్క‌ల ప్ర‌దేశంలోని అటవీ ప్రాంతం న‌రికేయ‌డం ప్రారంభించారు. దాని వ‌ల్ల‌, సూర్యరశ్మి భూమిని చేరుకొని, మ‌ట్టిలోప‌ల ఉన్న మంచు వేడెక్కుతూ నేల కుంగిపోవ‌డం ప్రారంభించిందని అధ్య‌య‌నంలో తెలిసింది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా త్వరలో ఇలా మరిన్ని 'న‌ర‌క ద్వారాలు' కనిపించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే,

జర్మనీలోని ఆల్‌ఫ్రెడ్ వెజెనర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫ్రాంక్ గుంథర్ 2016లో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం, గత కొన్నేళ్ల‌ల్లో బిలం త‌ల‌వైపు గోడ సంవత్సరానికి సగటున 10 మీటర్లు (33 అడుగులు) పెరిగిన‌ట్లు వెల్లడించింది. ఇక‌, ఈ ఏడాది పెరిగిన ఉష్టోగ్ర‌త‌ల‌తో సంవత్సరానికి 30 మీటర్లు (98 అడుగులు) వరకు భూమి కుంగుతున్న‌ట్లు అధ్య‌యనంలో పేర్కొన్నారు. ఇక‌, ఈ బిలం కుంగిపోకుండా ఆప‌డం ఎవ‌రి త‌రం కాద‌ని అధ్య‌య‌నంలో స్ప‌ష్టంగా వెల్ల‌డించారు. దీనితో, ఈ ప్రాంతంలో నివసించే యాకుట్ ప్రజలు, 'బటగైకా బిలం' నుండి వస్తున్న భూమి కుంగే శ‌బ్ధాల‌ను వింటూ తీవ్ర భ‌యాందోళ‌ల‌నల‌కు గురౌతున్నారు. కొన్నేళ్ల‌కు ఇది భూమిని మింగేస్తుంద‌ని అనుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed