చైనాలో ఘోర ప్రమాదం.. రెస్టారెంట్‌లో భారీ పేలుడు

by Vinod kumar |
చైనాలో ఘోర ప్రమాదం.. రెస్టారెంట్‌లో భారీ పేలుడు
X

బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకెళ్తే, ఇంచువాన్ సిటీలోని నిర్వహణలో బార్బిక్యూ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లీకైంది. ఇది భారీ పేలుడుకు దారితీసింది.

ఈ ప్రమాదంలో కస్టమర్లు, సిబ్బంది కలిపి 31 మంది మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయాలపాలైనట్టు చైనా ప్రభుత్వ మీడియా గురువారం వెల్లడించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే డజనుకు పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed