Elephants: రెండు జిల్లాల్లో ఏనుగుల బీభత్సం.. వణికిపోతున్న ప్రజలు

by srinivas |   ( Updated:2024-10-25 14:29:18.0  )
Elephants: రెండు జిల్లాల్లో ఏనుగుల బీభత్సం.. వణికిపోతున్న ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఏనుగులు(Elephants) బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నుంచి జనారణ్యంలోకి వెళ్తున్నాయి. ప్రజలను భయపెడుతున్నాయి. పంట పొలాలు నాశనం చేస్తున్నాయి. ఒక్కోసారి దాడులకు దిగుతున్నాయి. దీంతో ప్రాణాలు పోతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో యాకోబ్ అనే రైతును దాడి చేశాయి. ఈ ఘటన మరువకముందే మరో జిల్లాలోనూ ఏనుగులు హల్ చల్ చేశాయి. చిత్తూరు జిల్లా(Chittoor District) పులిచెర్ల మండలం కొంగవారిపల్లిలో మామిడి తోట(Mango orchards)ల్లో గుంపులు గుంపులుగా సంచరించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారుల(Forest officials)కు సమాచారం అందించారు. ఈ మేరకు ఏనుగులను అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం తిత్తిరి పంచాయ(Tithiri Panchayat)లో ప్రజలకు ఏనుగులు వణుకుపుట్టిస్తున్నాయి. నిన్న పెద్ద బొండపల్లి(Pedda Bondapalli)లో రైతు యాకోబును తొక్కి చంపి ఇవాళ తిత్తిరి పంచాయతీలో సంచరిస్తున్నాయి. రోడ్లను దాటుతూ కనిపించడంతో ప్రజలు హడలిపోయారు. ఏనుగుల సంచారంపై విషయం తెలుసుకున్న అధికారులు ట్రాకర్స్ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఏనుగులు ఉన్న వైపు ప్రజలు ఎవరూ వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు.

Advertisement

Next Story