- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Tummala: ఆదిలాబాద్ కలెక్టర్‌కు మంత్రి తుమ్మల ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్(Adilabad Collector)కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) ఫోన్ చేశారు. శుక్రవారం కలెక్టర్ వాహనం ఎదుట రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనలపై స్పందించిన తుమ్మల.. కలెక్టర్(Adilabad Collector)కు ఫోన్ చేసి రైతుల డిమాండ్లు పరిష్కరించాలని ఆదేశించారు. పత్తి కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్ మార్కెట్(Adilabad Market)లోని పత్తి కొనుగోళ్లలో తొలి రోజే లొల్లి జరిగింది. పత్తిలో తేమ 8 నుండి 12% లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని భారత కాటన్ కార్పొరేషన్ (CCI) మొండికేసింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి తుమ్మల(Minister Tummala Nageswara Rao) స్పందించి కలెక్టర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు.