Accused Arrested: గంగారెడ్డి హత్య కేసు నిందితుడు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు.. జగిత్యాల ఎస్పీ కీలక ప్రకటన

by Shiva |
Accused Arrested: గంగారెడ్డి హత్య కేసు నిందితుడు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు.. జగిత్యాల ఎస్పీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) అనుచరుడు గంగారెడ్డి (Ganga Reddy) హత్యకేసు నిందితుడు సంతోష్‌ (Santhosh)ను జగిత్యాల పోలీసులు (Jagityala Police) అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ క్రమంలోనే ఎస్పీ అశోక్ కుమార్ (SP Ashok Kumar) కీలక ప్రకటన చేశారు. 2020 సంవత్సరంలో సంతోష్‌ (Santhosh)పై ఓ వివాదంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (SC, ST Atorcity) కేసు నమోదైందని ఆయన పేర్కొన్నారు. అయితే, కేసులో రాజీకి నిందితుడు సంతోష్ (Santhosh), గంగారెడ్డి (Ganga Reddy)ని ఆశ్రయించాడని పేర్కొన్నారు.

రాజీ అంశంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగిందని.. దీంతో రాజకీయంగా ఎదుగుతోన్న గంగారెడ్డి (58)ని ఎలాగైన మట్టుబెట్టాలని సంతోష్ కక్ష పెంచుకున్నాడని వివరించారు. ఈ నెల 22న ఉదయం గ్రామంలో బైక్‌పై వెళుతున్న గంగారెడ్డిని మొదట కార్‌తో వెనుక నుంచి సంతోష్ ఢీకొట్టాడని తెలిపారు. అనంతరం అతడు అదుపుతప్పి కింద పడిపోగానే కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశాడని పేర్కొన్నారు. వెంటనే అక్కడి నుంచి నిందితుడు సంతోష్ పరారయ్యాడని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story