phone tapping case : ప్రభాకర్ రావు ఎక్కడ ల్యాండయినా పట్టేస్తాం..

by Kalyani |   ( Updated:2024-10-25 14:51:13.0  )
phone tapping case : ప్రభాకర్ రావు ఎక్కడ ల్యాండయినా పట్టేస్తాం..
X

దిశ, సిటీక్రైం : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1 నిందితుడు ప్రభాకర్ రావు ఇండియాలో ఎక్కడ ల్యాండైన పట్టేసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నాడన్న ప్రచారం వాస్తవం లేదన్నారు. ప్రభాకర్ రావు పై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఏ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు అడుగు పెట్టగానే ముందుగా మాకు సమాచారం ఇస్తారన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని సీపీ ఆనంద్ వివరించారు.

సలీమ్ వ్యవహారంపై ఎన్ఐఏ, ముంబాయి ఏటీఎస్ నజర్...

సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం ఘటనలో నిందితుడు సలీమ్ ను ఇప్పటి వరకు అతని కుటుంబ సభ్యులు కాని, ఇంకా ఎవరు కూడా వచ్చి కలవలేదని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. అతని మనస్సులో మతోన్మాదం నిండిపోయి ఈ చర్యలకు పాల్పడ్డాడని స్పష్టమైందన్నారు. వారి ఇంట్లో వారికి ఫోన్ చేయగానే "మూర్తీ తోఢా క్యా" అంటూ వారు అడిగారని సీపీ వివరించారు. కంప్యూటర్ ఇంజనీర్ అయిన సలీమ్ గతంలో ఇదే విధంగా వ్యవహరించిన ఘటనలపై ముంబాయిలో రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. పలు కంపెనిలలో ఉద్యోగం చేసినా విచిత్ర ప్రవర్తన తో వివాదాస్పదుడిగా మారాడని, అతని చేష్టలతో విసిగిపోయి కుటుంబ సభ్యులు మారతాడని ఆశతో సికింద్రాబాద్ లోని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లో జాయిన్ చేశారని సీపీ పేర్కొన్నారు. అలా వచ్చిన సలీమ్ మొత్తం న్యూసెన్స్ చేసి పెట్టాడని సీపీ చెప్పారు. సలీమ్ వ్యవహారానికి సంబంధించిన కేసులను ముంబాయి ఏటీఎస్, ఎన్ఐఏ , హైదరాబాద్ పోలీసులు అందరూ చూస్తున్నామని సీపీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed