ఆ ఆస్తుల్లో షర్మిలకు వాటా లేదు.. వైవీ సుబ్బారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by srinivas |
ఆ ఆస్తుల్లో షర్మిలకు వాటా లేదు.. వైవీ సుబ్బారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి(Late CM Rajasekhar Reddy) కుటుంబంలో ఆస్తుల పంచాయితీ(Assets Panchayat) తారా స్థాయికి చేరింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్‌(Saraswati Power and Industries Private Limited)లో వాటాల కేటాయింపుపై ఎన్‌సీఎల్‌టీ(NCLT)లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) పిటిషన్ దాఖలు చేశారు. మొదట్లో తన సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila)కు వాటాలు కేటాయించాలని భావించామని, కాని ఇప్పుడు ఆ ఆఫర్‌ను విరమించుకుంటున్నామని పిటిషన్‌లో పేర్కొన్నారు. కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నట్లు ప్రకటించాలని, తన తల్లి, సోదరి కోసం ఉద్దేశించిన షేర్ల బదిలీని రద్దు చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. గతంలో హామీలు ఇచ్చినప్పటికీ వైఎస్ విజయమ్మ(YS Vijayamma)కు, షర్మిలకు వాటాలు ఇవ్వాలని తాము కోరుకోవడంలేదని ఆయన పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్ విజయమ్మ, షర్మిలతో పాటు మరికొంతమందికి ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.

దీంతో వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి అభిమానులకు లేఖ రాశారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు స్థాపించిన అన్ని వ్యాపారాల్లో తనకు, తన సోదరుడు జగన్‌కు ఉన్న కుమారులు, కూతుళ్లకు వాటాలు ఇవ్వాలనేది మ్యాండేట్ అని పేర్కొన్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్‌లో తప్ప మిగిలిన ఏ ఆస్తిలోనూ పంపకాలు జరలేదని తెలిపారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆకస్మాత్తుగా చనిపోవడంతో ఆస్తి పంపకాలు జరగలేదని తెలిపారు. జగన్ చెబుతున్న ఆస్తులన్నీ కుటుంబ సభ్యులివేనని చెప్పారు. నలుగురు బిడ్డలకు సమానంగా ఆస్తులు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి అనుకున్నారని, ఈ మేరకే తాను మాట్లాడుతున్నానని లేఖలో షర్మిల పేర్కొన్నారు.

దీంతో వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివాదంపై జగన్, షర్మిల బాబాయ్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YCP Rajya Sabha member YV Subbareddy) స్పందించారు. వైఎస్ జగన్‌ సొంత ఆస్తులు అని MOU‌లో క్లియర్‌గా రాసి ఉందని తెలిపారు. దాన్ని చదివే షర్మిలమ్మ సంతకం పెట్టారని చెప్పారు. బలవంతం మీద కాదని, చెల్లెలిపై ప్రేమతో ఈ ఆస్తులు ఇస్తున్నట్టు రాసి ఉందన్నారు. ఈ వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారని తెలిపారు. ఈ ఆస్తుల్లో షర్మిలమ్మకూ వాటా ఉంటే ED, CBI కేసులు కేవలం జగన్‌ మీద మాత్రమే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. షర్మిలమ్మ మీద కూడా ఎందుకు పెట్టలేదన్నారు. కంపెనీలో షేర్‌ హోల్డర్‌ కాని షర్మిలకు డివిడెంట్ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్‌కు లేదన్నారు. ‘‘నిజాలు చెప్పేందుకే NCLTలో జగన్‌ పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. NCLTలో జగన్‌ పిటిషన్ వేయకపోతే బెయిల్ రద్దు చేయాలని టీడీపీ నేతలు పిటిషన్ వేస్తారు. కాంగ్రెస్, టీడీపీ అక్రమ కేసుల్లో జగన్ జైలుకెళ్లారు. జగన్ ఆస్తులు ED అటాచ్‌ చేసుకుంది.’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed