Youtube : కంటెట్‌ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెరిగేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన యూట్యూబ్..!

by Maddikunta Saikiran |
Youtube : కంటెట్‌ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెరిగేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన యూట్యూబ్..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ (Video streaming platform) యూట్యూబ్(Youtube) యూజర్లను ఆకట్టుకోవడనికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక విషయాలలో కొత్త అప్ డేట్(Update) లను తీసుకొచ్చిన యూట్యూబ్ తాజాగా మరో సరికొత్త ఫీచర్‌(New feature)ను భారత్‌(India)లో అందుబాటులోకి తీసుకొచ్చింది. షాపింగ్ అఫ్లియేట్(Shopping Affliate) పేరుతో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా అర్హులైన వారు తన వీడియోలు(Videos), షార్ట్స్(shorts) ద్వారా నేరుగా ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. కాగా ఈ ఫీచర్‌ ఇప్పటికే దక్షిణ కొరియా(South Korea), అమెరికా(America) లాంటి దేశాల్లో అందేబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ సేవల్ని తాజాగా మరిన్న దేశాలకు విసర్తించేందుకు యూట్యూబ్ ప్రణాళికలు రచిస్తోంది.

ఇందులో భాగంగా యూట్యూట్ తాజాగా ఈ సేవలను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇందుకోసం మింత్రా(Myntra), ఫ్లిప్‌కార్ట్‌తో(Flipkart)ఒప్పందం కుదుర్చుకుంది. అర్హులైన కంటెట్‌ క్రియేటర్లందరికీ(content creators) ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఫీచర్‌ను పొందాలంటే క్రియేటర్లు ముందుగా యూట్యూబ్‌ షాపింగ్‌లో సైనప్‌(signup) అవ్వాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్(Application)ను యూట్యూబ్ అప్రూవ్ చేసాక క్రియేటర్లు ఈ ఫీచర్ యాక్సెస్‌ చేసుకోవచ్చు. దీంతో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసే వీడియోలు, షార్ట్‌లు, లైవ్‌స్ట్రీమ్‌లో ఉత్పత్తులను ట్యాగ్‌ చేయొచ్చు. యూజర్లకు ఆ ఉత్పత్తులు నచ్చితే పక్కనే ఉన్న షాపింగ్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే మింత్రా, ఫ్లిప్‌కార్ట్ రిటైలర్ సైట్ల నుంచి అవసరమైన కొనుగోలు చేసేలా అనుమతి ఇస్తుంది. దీనికోసం వేరే బ్రౌజర్‌ పేజ్‌కు కూడా వెళ్లాల్సిన పనిలేదు. అక్కడే ప్రొడక్ట్‌ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాదు నచ్చిన ప్రొడక్ట్‌ని అక్కడే పిన్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. ఇలా యూట్యూబర్స్‌ ప్రమోట్‌ చేసిన ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేస్తే క్రియేటర్లకు కమీషన్‌ లభిస్తుందని యూట్యూట్ తెలిపింది. ఒక వీడియోలో సుమారు 30 ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సుమారు 10 వేల మంది కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు(Subscribers) ఉన్న వారికే ఈ అవకాశం ఉంటుంది. అయితే పిల్లల కోసం నడుపుతోన్న ఛానల్స్‌, మ్యూజిక్‌ ఛానల్స్ నడిపే వారికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉండదని యూట్యూబ్ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం వల్ల కంటెంట్ క్రియేటర్లకు, వ్యూయర్లకు మధ్య బంధం బలపడుతుందని యూట్యూబ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed