- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ravi Shastri: రోహిత్ శర్మ కెప్టెన్సీపై రవిశాస్త్రి తీవ్ర విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) తీవ్ర విమర్శలు చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) ఏర్పాటు చేసిన ఫీల్డింగ్ సరిగా లేదని అన్నారు. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ ఉండాలని అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. వెంట వెంటనే వికెట్లు తీసేలా వ్యూహం రచిస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయని వెల్లడించారు. కాగా, పుణె వేదికగా భారత్-న్యూజిలాండ్(India-New Zealand) జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు కూడా భారత ఆటగాళ్లు తడబడ్డారు.
తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులు చేసింది. బదులుగా టీమిండియా కేవలం 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు మొత్తం ఆధిక్యం 300 పరుగులు దాటింది. ఈ టెస్టు మ్యాచ్ ఇంకా మూడు రోజుల సమయం ఉండగా, న్యూజిలాండ్ ఆటతీరు చూస్తుంటే భారత్ ఎదుట భారీ లక్ష్యం పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒక వేళ ఈ మ్యాచ్ లోనూ భారత్ పరాజయం పాలైతే సిరీస్‌ను కూడా చేజార్చుకోనుంది. అలాగే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన లెక్కలు కూడా మారనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.