Amazon Diwali Special Sale: అమెజాన్ దీపావళి స్పెషల్ సేల్.. ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై అదిరిపోయే ఆఫర్లు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-25 14:20:36.0  )
Amazon Diwali Special Sale: అమెజాన్ దీపావళి స్పెషల్ సేల్.. ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై అదిరిపోయే ఆఫర్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం దీపావళి పండగా సీజన్(Diwali Festival Season) నడుస్తోంది. ప్రతి ఏడాది ఫెస్టివల్ సందర్భంగా ప్రజలు ఏదో ఒక కొత్త వస్తువు కొనాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల(Customers)ను ఆకట్టుకోవడానికి పలు కంపేనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇటీవలే ఫ్లిప్ కార్ట్(Flipkart) దీపావళి సీజన్ సందర్భంగా (Big Diwali Sale) పేరుతో సేల్ తీసుకురాగా.. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) కూడా 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్(Great Indian Festival Diwali Special Sale) పేరుతో సేల్ ను తీసుకొచ్చింది. ఈ సేల్ అక్టోబర్ 29 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా అనేక రకాల వస్తువులపై ఆఫర్లను అందిస్తోంది.

ఇదిలా ఉంటే.. మన దేశంలోని గత కొన్ని రోజులుగా ఢిల్లీ(Delhi), ముంబై(Mumbai), కోల్ కతా(Kolkata), హైదరాబాద్(Hyderabad) లాంటి ప్రముఖ నగరాల్లో కాలుష్య స్థాయిలు(Pollution levels) పెరిగిపోతున్నాయి. మరికొన్ని రోజులో దీపావళి పండగ రాబోతుంది. దీంతో వాయు కాలుష్యం(Air pollution) మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్‌(Air purifier) కొనాలనుకునే వారికి అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఎయిర్ ప్యూరిఫైయర్‌ లపై ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా యురేకా ఫోర్బ్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ 150(Eureka Forbes Air Purifier 150) పై ప్రత్యేకమైన ఆఫర్ ను అందిస్తోంది. రూ. 9000 విలువైన ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ను ఈ సేల్ లో రూ.4,999కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు, రూ. 10, 000 విలువైన రివార్డులను కూడా పొందొచ్చు. ఇక రూ. 19,999 విలువైన Xiaomi 4 స్మార్ట్(Xiaomi 4 Smart) ఎయిర్ ప్యూరిఫైయర్ ను రూ. 13,999, ఫిలిప్స్ AC0920(Philips AC0920) స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ రూ. 12,499, కోవే ప్రొఫెషనల్(Coway Professional) ఎయిర్ ప్యూరిఫైయర్ రూ. 19,999, డైసన్ TP10(Dyson TP10) ఎయిర్ ప్యూరిఫైయర్ రూ. 32,899, హనీవెల్(Honeywell) ఎయిర్ ప్యూరిఫైయర్ రూ. 7,997, ఫుల్మినర్(FULMINARE) ఎయిర్ ప్యూరిఫైయర్ రూ. 4,499లకే ఈ సేల్ లో కష్టమర్లు కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Next Story