ఐఈడీ పేలి నలుగురు సైనికులు మృతి..పాకిస్థాన్‌లో ఘటన

by vinod kumar |
ఐఈడీ పేలి నలుగురు సైనికులు మృతి..పాకిస్థాన్‌లో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫంఖ్తుంఖ్వా ప్రావీన్సులో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రాబంగ్లా, తర్ఖానాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా..ఐఈడీ బాంబు పేలి నలుగురు సైనికులు మరణించగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు శనివారం తెలిపారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి బ్లాస్టింగ్‌కు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రాణాలు కోల్పోయిన సైనికులను జుబైర్, ఇజాజ్, ఫైసల్, ఆసిఫ్‌లుగా గుర్తించారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. కాగా, ఓ నివేదిక ప్రకారం 2024 మొదటి త్రైమాసికంలో పాకిస్థాన్ సుమారు 245 తీవ్రవాద దాడులను ఎదుర్కొంది. ప్రధానంగా హింసాత్మకమైన ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులలో పౌరులు, భద్రతా సిబ్బంది కలిపి సుమారు 432 మంది మరణించారు. అంతేగాక 370 మందికి పైగా గాయపడ్డారు. కేవలం ఖైబర్ ఫంఖ్తుంఖ్వాలోనే 86శాతం దాడులు జరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed